Narendra Modi లేఖ: Vijay Deverakonda–Rashmika Mandanna పెళ్లికి ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) లేఖ రాశారు. ఈ నెల 26 తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం(VIROSH Wedding) జరగనుంది. కాబోయే వధూవరులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సప్తపదితో జీవితాంతం వర్ధిల్లాలని ఆశీస్సులు అందించారు. విజయ్, రష్మిక జీవితం అద్భుతంగా ఉండాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. దేవరకొండ, రష్మిక పెళ్లికి తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, ఈషా రెడ్డి వంటి అనేక మంది సినీ ప్రముఖులతో పాటు ఎంపిక చేసిన రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
విజయ్–రష్మిక పెళ్లికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా సినిమా విభాగాన్ని ఫాలో అవ్వండి.




