25 February, 2026 | 3:19 AM

వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

25-02-2026 01:38 AM

న్యూయార్క్ : అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను వింటర్ స్టార్మ్ హెర్నాండో అనే బాంబ్ సైక్లోన్ వణికిస్తోంది. ఈ భారీ మంచు తుపాను కారణంగా న్యూయార్క్ సహా పలు రాష్ట్రాల్లో మంచు పేరుకుపోయింది. దీంతో జనజీవనం స్తంభించింది. వేల సంఖ్యలో ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమాన ప్రయాణాలపైనా మంచు ప్రభావం పడింది. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు పది వేల సర్వీసులు రద్దయ్యాయి. కెనడా నుంచి దూసుకొచ్చిన అతి శీతల గాలులు అట్లాంటిక్ మహాసముద్రంలోని వెచ్చని గాలులతో ఢీకొట్టడం వల్ల ఈ బాంబ్ సైక్లోన్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.