18 May, 2026 | 7:01 PM

భారత్, నార్వే గ్రీన్ స్ట్రేటజీ.. ప్రపంచ దేశాలకు ప్రయోజనాలు

18-05-2026 05:50 PM

భారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇటీవల భారత్, ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల భారత్, నార్వేకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. భారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. భారత కంపెనీలు గ్లోబల్ సొల్యూషన్ సెంటర్లుగా మారాయని మోదీ వెల్లడించారు.

స్కిల్ డెవలప్ మెంట్, టాలెంట్ మొబిలిటీ చాలా కీలకమైనదన్నారు. మెరైన్ ఎకనామీ, మెరైన్ సెక్యూరిటీలా భారత్- నార్వే కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ విభాగాల్లో ఇరుదేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య మంచి సంబంధాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే గ్రీన్ స్ట్రేటజీ వల్ల ప్రపంచ దేశాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.