ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి

06-10-2026 | 04:14pm
  1. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి 
  2. గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

గణపురం,అక్టోబర్ 06 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Gram Panchayat Sarpanch Katkuri Radhika Srinivas) అన్నారు. మంగళవారం గణపురం మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను(PM Shri Model School) ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బియ్యాన్ని  అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల గదుల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదని విద్యార్థులు సర్పంచ్ రాధిక దృష్టికి తీసుకువచ్చారు. తాత్కాలికంగా ఫ్యాన్లకు మరమ్మతులు చేయిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్ తిరుపతికి సూచించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, రేగురి లక్ష్మారెడ్డి, దూడపాక దుర్గయ్య, గుర్రం తిరుపతి గౌడ్, తదితరులున్నారు.

మరిన్ని వార్తలు