29 April, 2026 | 7:51 PM

వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

29-04-2026 06:40 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్దుర్తి విద్యార్థులు సాధించిన అద్భుత విజయానికి గ్రామస్తులు అభినందిస్తున్నారు. బుధవారం విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో  పాఠశాల నుండి 150 మంది విద్యార్థులు హాజరు కాగా , అందరూ 150 మంది విద్యార్థిని విద్యార్థులు  ఉత్తీర్ణులు కావడం ఎంతో గర్వకారణం. గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. వంద శాతం ఫలితాన్ని సాధించడం పాఠశాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

ఈ విజయం విద్యార్థుల కష్టoతో పాటు, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలిసి సాధించిన గొప్ప ఫలితం. వెల్దుర్తి మండలంలోనే మండల స్థాయిలో 560 మార్కులతో గొట్టిముక్కల అక్షయ మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో 556 మార్కులతో శెట్టి మేఘన రెండవ స్థానంలో, 553,మార్కులతో రాగుల లిప్సిక మూడో స్థానంలో రావడం అలాగే 42మంది విద్యార్థులు500 కు పైగా మార్కులు సాధించడం పాఠశాలకే ఎంతో గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య ఆనందం వ్యక్తం చేశారు.

 ఉపాధ్యాయులు తమ అనుభవాన్ని ఉపయోగించి విద్యార్థులకు సరైన దిశలో మార్గనిర్దేశం చేయడం, ప్రధానోపాధ్యాయులు సాంబయ్య   ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే ఈ విజయ గాథ సాధ్యమైంది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అవసరమైన సహకారం అందించి ఈ విజయానికి తోడ్పడ్డారు.అని విద్యార్థిని విద్యార్థుల  తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి విద్యార్థుల అభివృద్ధి కోసం చేసిన కృషి ఫలితమే ఈ 100% ఫలితం. ఇది కేవలం ఫలితం మాత్రమే కాదు, భవిష్యత్తులో మరిన్ని విజయాలకు బాటలు వేసే గొప్ప ఆరంభమని పాఠశాల హెచ్వోడి సాంబయ్య ను అలాగే ఉపాధ్యాయ బృందంను, విద్యార్థినీ విద్యార్థులను  గ్రామస్తులు  అభినందిస్తున్నారు.