ఎమ్మెల్యే పోచారం నివాసంలో వినాయక చవితి వేడుకలు

15-09-2026 | 01:06pm

బాన్సువాడ, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): వినాయక చవితి(Vinayaka Chavithi) పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas Reddy) తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో పోచారం సతీమణి పుష్ప, కుమారుడు  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి, మనుమలు రుషాంక్ రెడ్డి, రిషిక్ రెడ్డి పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలను ప్రసాదించాలని పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రార్థించారు.తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా గణనాథుని ఆశీస్సులు నిండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు