బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు
- పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
- ఫిర్యాదు ఉపసంహరణకు తీవ్ర ఒత్తిడి
- కేసు నమోదుకు పోలీసుల కాలయాపన!
- బాలిక కుటుంబం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని బండి సాయి భగీరథ కరీంనగర్ పీఎస్‌లో ఫిర్యాదు
మేడ్చల్/కుతుబుల్లాపూర్, మే 9 (విజయక్రాంతి) : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో శనివారం పోక్సో కేసు నమోదైంది. బండి సాయి భగీరథ డి సెంబర్ 31న మొయినాబాద్‌లోని ఒక ఫా మ్‌హౌస్‌లో, ఆ తర్వాత మరో రెండు చోట్ల లైంగిక దాడి చేశారని ఓ బాలిక తల్లి పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు సాయి భగీరథపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు కేసు నమోదుకు తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. బాధితురాలి తల్లి ఉదయం నుంచి పోలీస్ స్టేషన్‌లోనే నిరీక్షించినట్టు స మాచారం. ఫిర్యాదు ఉపసంహరణకు తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది.
అయినప్పటికీ బాధితులు వెనక్కి తగ్గలేదని సమాచారం. ఇదిలా ఉండగా తమను బాలిక కుటుంబం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని కరీంనగర్‌లో బం డి భగీరథ ఫిర్యాదు చేసిన తర్వాతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో తోటి విద్యార్థిపై దాడి
భగీరథ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహీంద్రా యూనివర్సిటీలో తోటి వి ద్యార్థి శ్రీరామ్‌పై 2023 జనవరిలో దాడి చేశాడు. దాడి చేసిన వీడియోలు వైరల్ అ య్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు అయింది. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో న్యాయవా దితో వచ్చి లొంగిపోయాడు. ఆ తర్వాత బా ధిత విద్యార్థి శ్రీరామ్ తనపై దాడి చేసిన వీడియో పాతదని స్టేట్మెంట్ ఇచ్చాడు.
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
బండి సంజయ్ కుమారుడు భగీరథపై పోక్సో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌కి ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను సంజయ్ ఎప్పటికప్పుడు ఎండ గ డుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో ఎదుటివారికి అస్త్రం దొరికినట్లు అయింది.






