10 May, 2026 | 2:09 AM

ఆడబిడ్డల రక్షణ కోసం మిలియన్ సార్లు పోరాడుతాం

10-05-2026 12:54 AM
  1. ఏ నిబంధన ప్రకారం మైనర్ బాలికపై హనీట్రాప్ కేసు నమోదు చేశారు
  2. బేటీ బచావో కేవలం నినాదమేనా
  3. కేంద్ర మంత్రి సంజయ్‌ని ఎప్పుడు బర్త్ప్ చేస్తారో ప్రధాని చెప్పాలి
  4. ఉన్నావ్ కేసులో బాధితురాలి తరఫున నిలిచిన రాహుల్‌గాంధీ ఇప్పుడు అండగా నిలబడతారా?
  5. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ జంగిల్ రాజ్‌గా మారింది
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : మహిళల గౌరవం కోసం గతంలో అణచివేతదారులతో, ప్రభుత్వాలతో పోరాడామని, ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు మళ్లీ పోరాడుతామని బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, న్యాయం కోసం వారు మూడు నెలలుగా తిరుగుతుంటే ఇ ప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారా అని ప్ర శ్నించారు.

ఏ నిబంధన ప్రకారం తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారని నిలదీశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన కేటీఆర్ శనివారం స్పందించారు. ప్రధానమంత్రితో పా టు రాష్ట్ర ప్రభుత్వం పైన పలు ప్రశ్నలు సం ధించారు. బాలిక పరిస్థితి, వారి కుటుంబం పైన జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవ లం ఒక నినాదమేనా?, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని, కేంద్రమంత్రి బండి సంజయ్ బర్త్ఫ్ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. బండి సం జయ్, ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులున్నాయా, నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? చెప్పాలని డిమాండ్ చేశా రు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ ని కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో మ హిళపై అత్యాచారం జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం కేసు నమోదు చేయకుం డా వేధింపులకు గురి చేస్తున్నదన్నారు. కాం గ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయిందన్నారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పోలీస్ శాఖ ఎందుకు స్పందించలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు మూడు నెలల పాటు ఎందుకు పోరాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

ఉన్నావ్ కేసులో బాధితురాలికి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ బా ధితురాలికి అండగా నిలబడతారా లేక మీ న్యాయం తెలంగాణ బాధితులకు వర్తించదా అని నిలదీశారు. బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ వేధించడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం తిరుగుతూ ఆ బాలి క ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు ఆమెనే నిందిస్తూ ‘విక్టిమ్ షేమింగ్’ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఫ్రాంచైజీలాగా మారిందని ఎద్దేవా చేశారు. ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో రెండు పార్టీలు కలిసి ఒక అపవిత్ర మైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చా యా అని అనుమానం వ్యక్తం చేశారు. అం దుకే ఇతర ఫోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమారిడిని ఎందుకు విచారిం చడం లేదని ప్రశ్నించారు. మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఈ ఘటనను చూస్తే అర్థమవు తోందని తెలిపారు.