6 July, 2026 | 12:24 AM

గంజాయిని తగలబెట్టిన పోలీసులు

11-06-2024 03:59 PM

రాజన్నసిరిసిల్ల, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పలు కేసుల్లో పట్టుకున్న 36.436 గంజాయిని పోలీసులు డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కాల్చివేశారు. నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, సభ్యులు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్లలోని రగుడు వద్ద గలా డంప్ యాడ్ నందు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపరచుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టారు. 

ఎస్పీ మాట్లాడుతూ... ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు. జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగలబెడతామని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.