సమయం ఇప్పించండి ఫిట్‌నెస్ చేసుకుంటాం
ఎమ్మెల్యేను కలిసి విన్నవించిన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేతలు
మహబూబ్ నగర్ : పాఠశాలలో ప్రారంభం అవుతున్న సందర్భంగా ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 40 శాతం బస్సులను ఫిట్నెస్ చేసుకోలేదని తమకు మరో 15 రోజులపాటు సమయం ఇప్పించేందుకు అవసరం అవసరమైన చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నేతలు మంగళవారం కలిశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఆర్టీవో అధికారులతో ఫోన్ ద్వారా సంభాషించారు. బస్సులు ఫిట్నెస్ ప్రక్రియను చేసుకునేందుకు కొంత సమయం గడువు ఇవ్వాలని సూచించారు. దీంతో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నేతలు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు ఉన్నారు. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేసుకుంటే బాగుండేది కదా అని విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటున్నారు.






