10 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •  

లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo

10-06-2026 05:41 PM

- గుడుంబా, మద్యం స్వాధీనం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తండాలో తెల్లవారుజామున బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సోదాలో జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, 2 డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా 20 మోటార్‌సైకిళ్లు,2 ఆటోలు,2 ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని తెలియజేసి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.