10 June, 2026 | 6:18 PM

Breaking News

జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •  

బొల్లారంలో గ్రామసభ

10-06-2026 05:43 PM

పలు అభివృద్ధి పనులపై తీర్మానం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామంలో గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామసభలో బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తీర్మానించడం జరిగింది. రాబోయే వర్షాకాలం సన్నద్ధతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఆరోగ్య, పారిశుద్ధ జాగ్రత్తలు ఉపాధి పథకం నూతన మార్గదర్శకాలు,ఓటర్ జాబితా సవరణ, విద్యుత్ భద్రత,రైతులకు వానకాల సాగు సూచనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే మొక్కజొన్న పంటకు ఎకరానికి 25 క్వింటాళ్లు వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ గ్రామసభలో ఎల్లారెడ్డి డి.ఎల్. పి.ఓ. సురేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు, పార్క్ లేషన్ ట్యాంకులు,ఫార్మా పౌండ్లు వంటి పనులు చేపట్టి భూగర్భ జలాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నల్ల బిల్లులు వసూలు చేయాలని ప్రజలకు కోరారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అమలుపై సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.