28 June, 2026 | 1:44 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

శంకర్‌పల్లి మండలం మోకిలా గ్రామంలో భద్రతపై పోలీసుల అవగాహన

05-02-2026 12:00 AM

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 4: ఇటీవల జరుగుతున్న దొంగతనాలను నివారించడానికి, నివాస ప్రాంతాలలో భద్రతా చర్యలను పెంపొందించడానికి మోకిలా పోలీసులు మోకిలలోని రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో బుధవారం భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు, సమావేశంలో మోకిలా, శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, గేటెడ్ అపార్ట్మెంట్ల అధ్యక్షులు, ఐసోలేటెడ్ విల్లాల యజమానులు, సెక్యూరిటీ ఇంచార్జ్, భద్రత సిబ్బంది .

ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిషన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో, నివాసతుల భద్రతను నిర్ధారించడంలో సమిష్టి బాధ్యత మరియు నివారణనిగా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బలమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు, స్థానిక పోలీసులతో సమన్వయాన్ని మెరుగుపరుచుకోవాలని మరియు ప్రవేశ, బయటకు వెళ్లే పాయింట్లను కఠినంగా పర్యవేక్షించాలని డిసిపి అన్నారు. ఈ కార్యక్రమంలో మోకిలా, శంకర్ పల్లి సిఐలు వీరబాబు, శ్రీనివాస్ గౌడ్ ఆయా పోలీస్ స్టేషన్లో ఎస్త్స్రలు, సిబ్బంది పాల్గొన్నారు.