17 July, 2026 | 2:31 AM

జనగామ జిల్లాలో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

17-07-2026 02:31 AM

ముగ్గురు నిందితులు అరెస్ట్, రూ.15.50 లక్షల సొత్తు రికవరీ

జనగామ, జులై 16 (విజయక్రాంతి): బచ్చన్నపేట మండలంలోఈ నెల 8వ తేదీ రాత్రి ఓయ్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ నెల 10వ తేదీన బచ్చన్నపేట గ్రామానికి చెందిన దొంతుల నిర్మల సోమలింగం కుటుంబం ఆసుపత్రికి వెళ్లి, హైదరాబాద్ నుండి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు మాయం కావడంతో బచ్చన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు, ఇన్చార్జి ఏసీపీ భీమశంకర్ పర్యవేక్షణలో జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పడి. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో బచ్చన్నపేట కొన్నే క్రాస్రోడ్ వద్ద హైదరాబాద్కు సొత్తు తరలిస్తున్న క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకోగా సొత్తు స్వాధీనం చేసుకొని 12 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు, 3.5 5 లక్షల విలువైనవెండి వస్తువులు, 3 మోటార్ సైకిళ్లు, పదిహేను వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని, దొంగతనం కేసులో నిందితులు కంప విజయ్ అలియాస్ మొండి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్, సల్మాన్ పాష, క్రైమ్ టీం ఎస్త్స్ర రాజ్ కుమార్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.