17 July, 2026 | 2:29 AM

రేపు ప్రత్యేక లోక్ అదాలత్

17-07-2026 02:29 AM

మంచిర్యాల క్రైం, జూలై 16 : రాష్ట్ర ఉన్న త న్యాయస్థానం ఆదేశానుసారం జిల్లా వ్యా ప్తంగా ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ లను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య గురు వారం తెలిపారు. జిల్లాలోని మంచిర్యాలతో పాటు బె ల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట న్యాయస్థానా ల్లో కూడా ఈ లోక్ అదాలత్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాజీ మార్గమే రాజ మార్గమని, వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, ఎన్‌ఐ యాక్ట్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని, ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగడం బదులు రాజీతో కక్ష్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలు, సందేహాలున్నా మా దృష్టికి తీసుకురావాలని, మా న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే తగిన న్యాయ సహాయాలు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.