9 May, 2026 | 9:37 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

లాడ్జి యజమానులకు పోలీసుల అవగాహన సదస్సు: ఎస్పీ రోహిత్ రాజ

09-05-2026 08:49 PM

కచ్చితమైన నిబంధనలు పాటించాలి

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఐఎంఏ ఫంక్షన్ హాలులో జిల్లాలోని లాడ్జిల యజమానులకు, అవగాహనా సదస్సును ఏర్పాటు చేసి ఎస్పి రోహిత్ రాజ్ పలు సూచనలు చేసారు. లాడ్జి  యజమానులు నేరాలను నియంత్రించడంలో, పోలీసు లకు  సహకరించాలని, శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో  సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్పీ  పలు సూచనలను చేశారు. లాడ్జిలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, బస చేసేవారి గుర్తింపు కార్డు, వచ్చి, వెళ్ళే ,సమయాన్ని రిసెప్షన్ వద్ద వారి వివరములు,నమోదు చేసుకున్న తర్వాత వంపాలి.

విదేశీయులు ఎవరైనా లాడ్జిలో బస చేస్తే,వారి వివరములు 24 గంటల లోపు ఆన్లైన్ ద్వారా (ఫారం- సి) నీ పోలీసులకు సమర్పించాలి. ప్రతిరోజు ఉదయం 6.00 గంటలకు రిజిస్టర్లోని సమాచారము,గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలను సంబందిత పోలీస్ స్టేషన్లో సమర్పించాలి.  రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఫుటేజిని కనీసం 30 రోజుల వరకు భద్రపరచాలి. అనుమానాస్పదంగా అనిపించే లగేజిని తనిఖీ చేయాలి. అనుమానిత వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

అనుమానిత వ్యక్తులు గా తప్పుడు వివరాలు ఇస్తున్నారని అనిపించినా,లాడ్జి గదుల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా. అపరిచిత వ్యక్తులు గ్రూపులుగా వచ్చి బస చేసినా వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కి లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. స్థానిక పోలీస్ స్టేషన్  SHO నంబర్లను ఎల్లప్పుడూ రిసెప్షన్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి.పోలీసులు ఎవరైనా నిందితుల కోసం గాలిస్తున్నపుడు, వారికి సహకరించాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి .అత్యవసర ఎగ్జిట్ ను కలిగి ఉండాలి. 

రిసెప్షన్ డెస్క్ క్రింద అత్యవసర అలారం ఏర్పాటుచేసుకోవాలి.ఏదైనా uhప్రమాదం లేదా గొడవ జరిగినప్పుడు దాన్ని నొక్కితే వెంటనే అలారం మోగేలా లేదా దగ్గరలోని పోలీస్ స్టేషనుకు సమాచారం వెళ్ళేలా ఉండాలి. సిబ్బంది వివరములు, వారి పూర్వాపరాలను పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిది. లాడ్జిలో సెక్యూరిటీ గార్డులను, గుర్తింపు పొందిన ఏదైనా సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వారై ఉండాలి.వారి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసి ఉండాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే,చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా,లాడ్జి లైసెన్సు రద్దు చేయబడుతుంది.