ఎర్రవల్లిలో పోలీసుల విచారణ
- కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి ఘటనపై దర్యాప్తు
- పసుపు నీళ్లతో శుద్ధి చేసి దళితులను అవమానించారన్న ఫిర్యాదుతో ముందుకు
- పలువురు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్
గజ్వేల్, సెప్టెంబర్ 10: సిద్దిపేట జిల్లా(Siddipet District) ఎర్రవల్లి(Erravalli)లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్(Former CM KCR farmhouse) ముట్టడి అనంతరం దళితులు నడిచిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారంటూ వచ్చిన ఫిర్యాదు(Complaint)పై పోలీసులు విచారణ(Police investigation) ప్రారంభించారు. ఎర్రవల్లి, వరదరాజపూర్ గ్రామాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు(Leaders of Dalit organizations) గురువారం గజ్వేల్ ఏసీపీ నరసింహులు(Gajwel ACP Narasimhulu)కు ఫిర్యాదు చేశారు. దళితులను అవమానించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
దళిత సంఘాల నాయకులతో పాటు రిమ్మనగూడ సర్పంచ్ మల్కనగళ్ల కరుణాకర్, పలు మండలాల కాంగ్రెస్ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు గురువారం ఉదయం ఏసీపీని కలిసి ఫిర్యాదు అందజేశారు. దళితులు నడిచిన నేల మలినమైందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహు లు తెలిపారు.
ఆయన నేతృత్వంలో ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీం సభ్యులు ఘట నాస్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశా లను పరిశీలిస్తున్నామని, ఫిర్యాదుల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ ని ఏసీపీ వెల్లడించారు. ఫామ్ హౌస్ ముట్టడిలో భాగంగా ఎర్రవల్లి, వరదరాజపూర్ గ్రామాల్లో దళితులు డప్పు కొట్టడం వల్లే పసు పు నీళ్లు చల్లారన్న ఘటనపై ప్రభుత్వం ప్రత్యే క సిట్ ఏర్పాటు చేయడంతో ఘటనలో ఉన్న పలువురు భయపడుతున్నట్టు తెలుస్తోంది.
గురువారం ఎర్రవల్లి వరదరాజపూ ర్ గ్రామాల్లో సీట్ ప్రత్యేక అధికారి విజయకుమార్ పర్యటిస్తారని, ఘటనలో పాల్గొన్న తమరిని కూడా విచారిస్తారన్న భయంతో జగదేవ్‌పూర్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉదయం నుం చి సాయంత్రం వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది.