11-11-2025 01:02:39 AM
జహీరాబాద్, నవంబరు 10 :జహీరాబా ద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు సోమవారం మొక్కలు నాటారు. వందేమాతర గీ తం రచించి 150 సంవత్సరాలు అయిన సం దర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల వల్ల చెట్లు పెరిగి మనిషికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నరకకుండా తమ బాధ్యతగా చెట్లను సంరక్షించాలని ఆయన పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్‌ఐలు వినయ్ కుమార్, సంగమేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.