11-11-2025 01:04:13 AM
జహీరాబాద్ టౌన్, నవంబర్ 10 :జహీరాబాద్ పట్టణ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 6 గురు వ్యక్తులనుఅరెస్ట్ చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.8,550 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.