18 April, 2026 | 2:43 PM

గోదావరిఖనిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

13-06-2025 11:11 AM

ఏడుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్

21,460/- రూపాయల నగదు 04 మొబైల్ ఫోన్ లు ఒక బైక్ స్వాధీనం

గోదావరిఖని, (విజయక్రాంతి): గోదావరిఖనిలో పేకాట స్థావరంపై 1-టౌన్  పోలీసుల ఆకస్మిక దాడి(Police Raid) చేసి ఏడుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని 1-టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి(Inspector Indrasena Reddy) తెలిపారు. ఆయన కథనం ప్రకారం గోదావరిఖనిలోని బాపూజి నగర్ లో ఒక ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి, పేకాట ఆడుతున్న ఏడుగురు జూదరులను, మరియు నిర్వాహకుడు శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని  వారి వద్ద నుండి రూ. 21,460/- రూపాయల నగదు, 04 సెల్ ఫోన్ లు, ఒక బైక్, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు.  

నిందితుల వివరాలు

కాకినాడ శ్రీనివాస్,బాపూజీ నగర్ గోదావరిఖని 

 బైరి అనిల్ కుమార్, బాపూజీ నగర్, గోదావరిఖని

 గడ్డం శ్రీధర్, గాంధీనగర్ గోదావరిఖని

 అటక పురం శ్రీకాంత్,బాపూజీ నగర్ గోదావరిఖని

నడిగోట్టు దేవేందర్, బాపూజీ నగర్ గోదావరిఖని

దాగేటి రాజేంద్రప్రసాద్, బాపూజీ నగర్, గోదావరిఖని

కాకినాడ కుమారస్వామి  బాపూజీ నగర్ గోదావరిఖని చెందిన వారిని తెలిపారు.