18 April, 2026 | 1:01 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఫిర్యాదుదారులకు ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవరించాలి

06-04-2025 10:37 PM

డిఎస్పీ పార్థసారథి..

పెన్ పహాడ్: సమాజ భద్రత లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ యంత్రాంగం మానసిక బాధ, ఇబ్బందులతో న్యాయం కోసం వచ్చిన ఫిర్యాదుదారులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవరించాలని డీఎస్పీ పార్థసారథి కోరారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఎండాకాలం సమీపించినందున గ్రామాలలో ఆరుబయట నిద్రిస్తున్న  వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దొంగల బెడద, చైన్ స్నాచర్స్ తిరుగుతున్నందున సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ఎంతటి వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్ఐ గోపికృష్ణ, ఏఎస్ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, సిబ్బంది ఉన్నారు.