టీఆర్‌ఎస్ గద్దె నిర్మిస్తుండగా అడ్డుకున్న పోలీసులు
కుషాయిగూడ, జూన్ 6 (విజయక్రాంతి): ఈసీఐఎల్‌లో టీఆర్‌ఎస్ జెండా గద్దెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు టిఆర్‌ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆవిర్భవించిందని జెండాను అడ్డుకోవడం టిఆర్‌ఎస్ పార్టీని ఎదిగనివ్వకుండా కుట్రలు చేస్తున్నారంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట వందలాది మంది కార్యకర్తలు ఆందోళనకు దిగారు? టిఆర్‌ఎస్ జండాను అటుకోవడంపై కార్యకర్తలు పోలీసుల తీరుపై మండిపడ్డారు.
టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మేక లలిత యాదవ్, గోగికర నవీన్, భవాని వేముల, వరికుప్పల సుధాకర్, యాదవరపు రమాదేవి, దికొండ కవిత, గోపు సదానందం, సంపత్ రావు, గౌతమ్ రెడ్డి, వంశీ, జయంత్ యాదవ్, సాయికుమార్ కొప్పుల, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.






