7 June, 2026 | 1:57 AM

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి

07-06-2026 12:00 AM

తెలంగాణ హక్కుల సాధన సమితి

ముషీరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని స్థానిక ప్రజలకు ప్రైవేట్ రంగ సంస్థల్లో 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరింది.

శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సమితి కన్వీనర్ ప్రొ.విజయేందర్ రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుపై పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని, చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ఉండాలని అన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, పదేళ్లకు పైగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులను ప్రతి ఏడాది భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమితి సభ్యులు పి. విజయమోహన్, డాక్టర్ జి. కిరణ్ కుమార్, టి.కృష్ణ, జైన్ కుమార్, రాముడు, మూర్తి,  ఉమేష్ పాల్గొన్నారు.