7 June, 2026 | 1:31 AM

రేపు ‘విద్యార్థి రక్షణ దీక్ష’

07-06-2026 12:00 AM

సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు 

ఎల్బీనగర్, జూన్ 6 : సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హయత్ నగర్ లో నిర్వహించనున్న ’విద్యార్థుల రక్షణ దీక్ష’ కార్యక్రమం పోస్టరును శనివారం ఉదయం హయత్ నగర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల అత్యంత నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంబిస్తుందని, ఉద్దేశపూర్వకంగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని ఆరోపించారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం అమలు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు బోయిని రాఘవేందర్ ముదిరాజ్, కార్యదర్శి ఏర్పుల బాలస్వామి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ మహర్షి, ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ ఎల్లయ్య, హైడ్రా ఏరియా ఇంచార్జ్ వరంగల్ రమేష్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ చార్జి రాపాక వెంకట్, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు శ్రీరాముల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.