ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు
అశ్వాపురం, మార్చి 15 (విజయక్రాంతి): మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున చింతిర్యాల సమీపంలో గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు.
కొమరం నరసింహరావు వద్ద ఉన్న ఇసుక ట్రాక్టర్తో పాటు ఇసుకను లోడ్ చేయడానికి ఉపయోగించిన రామచంద్రాపురం గ్రామానికి చెందిన మిట్టకంటి మహేష్ రెడ్డి ఫ్రంట్ లోడర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై ఇద్దరిపైతో పాటు ట్రాక్టర్ యజమానిపై కూడా పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అశోక్ రెడ్డి హెచ్చరించారు.




