16 March, 2026 | 1:45 AM

జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్లు పంపిణీ

16-03-2026 12:05 AM

బూర్గంపాడు, మార్చి15 (విజయక్రాంతి): రంజాన్ పండుగ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని బూర్గంపాడు,సారపాక జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని యాసీన్ మసీద్, సారపాకలోని బసప్ప క్యాంపు కాలనీలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా మెరుగుపడినటువంటి వారందరూ వారు సంపాదనలో 2.5 శాతం జకాత్ రూపంలో తీసి నిరుపేదలకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ సభ్యులు జహీర్ పాషా, అబ్దుల్ సలీం, సైదుద్దీన్, ఇర్షాద్, ఇమ్రాన్, షహబాజ్, బూర్గంపాడు సారపాక గ్రామ పెద్దలు షేక్ దస్తగీర్, మహమ్మద్ అబ్దుల్ జబ్బర్, సయ్యద్ ఉమర్ హుస్సేన్, నవాబ్ జాని, వలి భాష, బషరత్, నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.