calender_icon.png 5 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ వెబ్‌సైట్ హ్యాక్?

05-12-2025 01:59:31 AM

  1. బెట్టింగ్ యాప్స్‌కు సైబరాబాద్, రాచకొండ వెబ్‌సైట్ల లింక్!
  2. గత 10 రోజులుగా సర్వర్ డౌన్‌తో అనుమానాలు
  3. అంతా ఉత్తిదే.. మెయింటెనెన్స్ కోసమే నిలిపివేశాం: డీసీపీ సుధీంద్ర

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో అత్యంత కీలకమైన పోలీస్ కమిషనరేట్ల వెబ్‌సైట్లు హ్యా కింగ్‌కు గురయ్యాయంటూ గురువారం సా యంత్రం జరిగిన ప్రచారం కలకలం రేపింది. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారిక వెబ్‌సైట్లు గత పది రోజులుగా పనిచే యడం లేదని, వాటిని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా బెట్టింగ్ యాప్స్‌కు రీ-డైరెక్ట్ అవుతున్నా యని వార్తలు గుప్పుమన్నాయి.

ఓ బెట్టింగ్ ముఠా ఈ పని చేసిందని, దీంతో ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసిందని జోరుగా చర్చ జరిగింది. అయితే, ఈ వార్తలపై సైబరాబాద్ ఎస్బీ ఇన్‌ఛార్జ్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర స్పష్టత ఇచ్చారు. వెబ్‌సైట్ హ్యాక్ కాలేదని, కేవలం మెయింటెనెన్స్ పను ల వల్లనే డౌన్ అయ్యిందని స్పష్టం చేశారు. నవంబర్ 15 నుంచి వెబ్‌సైట్ మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్ పనులు చేపట్టామని, వెబ్‌సై ట్ భద్రతా ప్రమాణాలను పెంచేందుకు, సాంకేతిక నిర్వహణ కోసం తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు.

అంతే తప్ప హ్యా కింగ్ జరగలేదు అని వివరణ ఇచ్చారు. ప్ర స్తుతం ఆ పనులన్నీ పూర్తయ్యాయని, వెబ్‌సైట్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజలకు అం దుబాటులో ఉందని డీసీపీ తెలిపారు. ప్రజ లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమాచారం కోసం, వివిధ పోలీస్ సేవల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఇకపై యథావిధిగా వినియోగించుకోవచ్చని సూచించారు.