05-12-2025 01:59:06 AM
ఎల్లారెడ్డిపేట,డిసెంబర్4(విజయక్రాంతి)ట్రాక్టర్ నడుపుతూ వెనకాల కేజీవిల్ ఊడిపో వడంతో వెనకాలకు చూసే క్రమంలో ట్రాక్టర్ పొలంలో పల్టీ కావడంతో అక్కడికక్కడే ఒకరు దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గడ్డం జితేందర్ గురువారం నాడు ట్రాక్టర్ కేజ్విల్ తో పొలం దున్నుతుండగా రైతు వేదిక సమీపంలోని ఓ పొలంలో కేజ్విల్ ఊడిపో వడంతో జితేందర్ వెనక్కి చూసే క్రమంలో ట్రాక్టర్ పెను ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యు వకుడు మృతి చెందడంతో వెంకటాపూర్ గ్రామంలో తీవ్ర విషాదంనెలకొంది.