చక్కని జీవితానికి.. పోలియో చుక్కలు..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో పల్స్ పోలియో
ఎల్బీనగర్, జూన్ 28 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఆయా డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దిల్సుఖ్నగర్లోని లోటస్ లాప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చైర్మన్ కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మన్ కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, డైరెక్టర్ అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హయత్ నగర్ పాత గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, నాయకులు అరుణ్, బీజేవైఎం నేత ఎర్ర ప్రేమ్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ లోని బాల్ రెడ్డి నగర్ బస్తీలో ఉన్న వినాయక మండపంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, మన్సూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి అమిత, సూపర్ వైజర్ భూషణ్, ఏఎన్‌ఎం సహిస్తా, స్థానికులు గోపి కృష్ణ, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాక్టౌన్ కాలనీలోని కిడ్జీ స్కూల్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్ యాదవ్ ప్రారంభించారు.
నాగోల్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ‘పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సరస్వతి, ఇన్చార్జి అంజి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ యూపీహెచ్‌ఎస్ హాస్పిటల్, సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, ఎస్ కే డీ నగర్ లోని డీపీఎస్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
కార్యక్రమంలో డాక్టర్లు మౌనిక, అక్సా పాల్, పద్మావతి కాలనీ అధ్యక్షులు రాజు గౌడ్ పాల్గొన్నారు. హస్తినాపురం డివిజన్ లోని నందనవనం దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు గజ్జల రాజు గౌడ్, బాలు, లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. హయత్ నగర్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీటీడీ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్
ఇబ్రహీంపట్నం, జూన్ 28 (విజయక్రాంతి) : తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కరాడి శీలత అనిల్ కుమార్,ముఖ్య అతిధిగా విచ్చేసి కేంద్ర రాష్ట్రప్రభుత్వంప్రతిష్టాత్మకంగానిర్వహిస్తున్న పల్స్ పోలియోకార్యక్రమాన్ని ప్రభుత్వపాఠశాల, అంగన్వాడీకేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాతు 0 నుండి 5సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
చిన్నారికి అన్ని సాధారణ టీకాలు వేసి ఉన్నప్పటికీ పోలియోరెండు చుక్కలువేయించడంఅత్యంతఅవసరమని తెలిపారు. ప్రతి చిన్నారి రక్షణ ప్రతి కుటుంబానికి భరోసా’ అనే నినాదంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సానం మంగమ్మ, శైలజ, ఆశా వర్కర్లు కవాడపు మాధవి, స్వరూప, లక్ష్మణ్ రెడ్డి భాగ్యలక్ష్మి అంగన్వాడీ టీచర్లు ఆశవర్కర్లు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.






