29 June, 2026 | 2:01 AM

నిండు జీవితానికి రెండు చుక్కలు

29-06-2026 12:00 AM

వెంకటాపూర్ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ

వెంకటాపూర్, జూన్ 28 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆదివారం ‘నిండు జీవితానికి రెండు చుక్కలు‘ అనే నినాదంతో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అన్నెబోయిన రాజు, మండల వైద్య అధికారి శ్రీకాంత్, ఎన్‌ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి, రామప్ప ట్రస్ట్ బోర్డు చైర్మన్ మిలుకూరి ఐలయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు చెన్నోజు శ్రీనివాస్, వార్డు సభ్యుడు బానోత్ సునీల్, అన్నెబోయిన శ్రావణ్, యుగేందర్, బూస సాంబయ్య, ల్యాగల కృష్ణ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ, వైద్య సిబ్బందిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.