7 July, 2026 | 6:21 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ యాక్షన్

24-10-2024 02:34 AM
  1. ప్రధాన నాయకులపైన చర్యలు తప్పవు
  2. సియోల్‌లో తెలుగు మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సియోల్‌లో హన్ నది పునరుజ్జీవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సియోల్‌లో తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి వంటి సుమారు 8 నుంచి 10 అంశాలపై చర్యలుంటాయని చెప్పారు.

దీనికి సంబంధించిన ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాలతో సిద్ధమయ్యాయని వివరించారు. సియోల్ నుంచి మరో 2 రోజుల్లో హైదరాబాద్ చేరేసరికి చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. కక్ష సాధింపు కాకుండా పూర్తి ఆధారాలతో చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని ప్రజలు భావించొద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాలతో ముందుకు వెళ్లబోతున్నామని పేర్కొన్నారు.