ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు
నిజామాబాద్: జిల్లాలోని మోపాల్ మండలం, మంచిప్ప గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి చెందిన 8 సంవత్సరాల బాలుడు గుప్పల అశ్విన్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే స్పందించిన మన ఆదివాసి నాయకపోడ్ కులస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సైతం – నా నాయకపోడ్ చేయూతకై వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించిన దాతలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించి మొత్తం రూ.43,950 సమకూర్చారు.
ఈ ఆర్థిక సహాయాన్ని ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామ పెద్దల సమక్షంలో అశ్విన్ తల్లి *లత* గారికి అందజేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు, కుల పెద్దలకు, గ్రామ పెద్దలకు, నేను సైతం – నా నాయకపోడ్ చేయూతకై వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ, అలాగే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆపదలో ఉన్న మన కుటుంబాలకు ఇలాగే అందరం అండగా నిలిచి, మన ఐక్యతను మరింత బలోపేతం చేద్దాం.
జై భీమన్న!
జై ఆదివాసి నాయకపోడ్!!
ఆదివాసి నాయకపోడ్ కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి!!!






