3 May, 2026 | 6:10 PM

ఓబీసీల రిజర్వేషన్లకు రాజకీయ చెదలు!

24-08-2025 12:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

ఆగస్టు 25 బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి :

* మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, 1978 డిసెంబర్‌లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం, సిఫార్సు కోసం బిందేశ్వరి ప్రసాద్ మండల్‌ను చైర్మన్ గా నియమించారు. బి.పి. మండల్ కమిషన్ నివేదిక 1980 డిసెంబర్ 31లోపు పూర్తి చేసి నివేదికను రాష్ర్టపతికి అందించింది. ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో, విద్యాసంస్థల్లో ఓబీసీల అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని సిఫార్సు చేశారు.

రిపోర్ట్ దించే నాటికి తిరిగి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిరా మండల్ కమిషన్ సిఫార్సులను పక్కనబెట్టారు. పదేండ్ల తర్వాత 1989లో జనతాదళ్ కేంద్రంలో అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ ఎన్నిక కావడం.. మండల్ కమిషన్ సిఫార్సులను ఆమోదించి అమల్లోకి తేవాలని కృషి చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లకు గాను 6-10 శాతమే నియామకాలు జరిగాయి. రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇంకా సాధించబడలేదు. 

బీసీ రిజర్వేషన్లు అమలు విషయంలో రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ప్రతి నిర్ణయంలో న్యాయ నిపుణుల సలహాలు, గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోని ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా కోర్టులో నిలబడేందుకు బీసీల స్థితిగతుల అధ్యయనం కోసం కులగణన చేసింది.

రాష్ర్టపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. అయినా తగ్గేదేలే అన్నట్టు గా రాజ్యాంగంలోని ఆర్థికల్ 263 ప్రకారం ప్రభు త్వం బీసీ రిజర్వేషన్లను 42శాతం పెంచుతూ జీవో ఇచ్చే ప్రయత్నంలో నిమగ్నం అయినట్టు తెలుస్తుంది. ఈ జీవోపై వ్యతిరేకులు కోర్టుకు వెళ్లినా అడ్డుపడకుండా ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెను క్కు అన్నట్టుగా సాగుతున్నది. 

 అయితే ఓబీసీల రిజర్వేషన్లు మొదటి నుంచి కూడా అడ్డుకుంటున్నది కనీసం రెండంకెల శాతం లేని కులాలే. భారత సామాజిక రాజకీయాల్లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఒక పెద్ద మలుపు. 52 శాతం భారతీయులు, వారి ప్రాతినిధ్యం, అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాల గురించి, చట్టస భల్లో వారి ప్రాతినిధ్యం గురించి ‘మండల్ కమిషన్’ రిపోర్టు సూచించింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలును, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరే కిస్తూ కోర్టుల్లో కేసులు వేయబ డ్డాయి.

ఆ కేసు జేఎన్‌యూ న్యూఢిల్లీ విద్యార్థిని ఇంద్రసహాని పేరుతో ప్రసిది ్ధపొందింది. మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకిస్తూ కొన్ని సామాజిక వర్గాలు, ప్రతిభ పేరిట అగ్రకులాలు ఉద్య మాలు లేవదీశారు. తద్వారా మలుపు తిరిగిన రాజకీయాల్లో మత దృక్పథం పెరిగి, రెండు సీట్లు న్న బీజేపీ లోక్‌సభలో 200 సీట్లకు పెరిగింది. ఎన్డీయే కూటమి తరఫున వాజపేయి ప్రధానిగా ఎన్నికయ్యారు.

మండల్ సిఫార్సులకు వ్యతిరేకంగా వేసిన కేసులో సుప్రీంకోర్టు అనేక కోణా లను పరిశీలించి తీర్పును వెలువరించింది. కేం ద్రానికి అనేక సూచనలను, ఆదేశాలను జారీ చేసింది. వాటిని అనుసరించి పీవీ హయాంలో 1993 నుంచి కేం ద్రంలో, రాష్ట్రాల్లో శాశ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్లు ఏర్పడ్డాయంటే అతిశయో క్తికాదు.  బీసీలంతా తమకు తెలిసిన, వీలైన పద్ధతుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవ సరం ఎంతో ఉంది. ఒకవేళ కొద్దో గొప్ప చైతన్యం వచ్చినా, అది రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోకుండా పోవడానికి గల కారణాలు వెతుక్కో వలసిన అవసరం ఉంది. 

మండల్ కమిషన్ నివేదిక

మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, 1978 డిసెంబర్‌లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం, సిఫార్సు కో సం బిందేశ్వరి ప్రసాద్ మండల్‌ను చైర్మన్ గా నియమించారు. బి.పి. మండల్ కమిషన్ నివేదిక 1980 డిసెంబర్ 31లోపు పూర్తి చేసి నివేదికను రాష్ర్టపతికి అందించింది. ప్రభుత్వ ఉద్యోగ రంగా ల్లో, విద్యాసంస్థల్లో ఓబీసీల అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని సిఫార్సు చేశా రు. రిపోర్ట్ దించే నాటికి తిరిగి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు.

ఇందిరా మండల్ కమిషన్ సిఫార్సులను పక్కనబెట్టారు. పదేండ్ల తర్వాత 1989లో జనతాదళ్ కేంద్రంలో అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ ఎన్నిక కావడం.. మండల్ కమిషన్ సిఫార్సులను ఆమోదించి అమల్లోకి తేవాలని కృషి చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల కు గాను 6-10 శాతమే నియామకాలు జరిగాయి. రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇంకా సా ధించబడలేదు.

నాటి నుంచి నేటి వరకు ఓబీసీలపై వివక్ష కొనసాగుతూనే ఉన్నది. నాడు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఉండాలని, మండల్ కమిషన్ ప్రతిపాదించిన అనేక సిఫార్సులు ఇంకా అమల్లోకి రావల్సి ఉన్నది. నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పూర్తిగా తొలగించేందుకు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ చట్టం -2018లోని సెక్షన్ 285(ఏ ) సవరణ చేస్తూ తెలం గాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌ను ప్రభావితం చేయ డం వల్లనే రాష్ర్టపతికి దస్త్రం చేరిందనే ప్రచారం జరిగింది. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు లేని అడ్డంకులు బీసీలకు ఎందుకు వస్తున్నాయో బీసీ ప్రజ లు డేగ కళ్ళతో గమనిస్తున్నారు. ఓబీసీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎవరి పాత్ర ఎంత మేరకు ఉందో సునిశితంగా గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో చక్రవడ్డీతో బాకీ తీర్చుకోవడం ఖా యం, దేనికైనా కాలమే అందుకు పరిష్కారం చూపిస్తుందని ఆశిద్దాం. 

అన్నింటా నిర్లక్ష్య వైఖరి.. 

బీసీల కోసం ఒక కమిషన్ వేసి వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నా.. గతంలో కాం గ్రెస్ కానీ ప్రస్తుత ఎన్డీయేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీ కానీ రాజ్యాంగ రక్షకులుగా ఇప్పటి వరకు ఏం చేయలేదనేది అక్షర సత్యం. అధికారంలో ఉన్న పార్టీలు కుల గణన చేసి బీసీ లు ఎందరున్నారో చెప్పాలి. మరోవైపు ప్రతిపక్ష పార్టీ మేం అధికారంలో కోస్తే న్యాయం చేస్తామని పేర్కొంటుంది.

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు గతంలో అధికారం అనుభవించిన సమయంలో బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం మరిచిపోయారా?. ఇక కాంగ్రెస్  అధికారంలో ఉన్న చోట అన్ని రకాల అవకాశాలను అగ్ర కులాలకే కల్పిస్తున్నారు. అందుకు మన రాష్ర్టమే నిద ర్శనం. ఇంకా చెప్పాలంటే దేశంలో ఒక ముఖ్యమైన పదవి కోసం ఇండియా కూటమి తరపున ఆ పార్టీ ఇటీవల ఉపరాష్ర్టపతి అభ్యర్థి ఎంపిక ఒక ప్రభల సాక్ష్యంగా పేర్కొనవచ్చు.

మన రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మంత్రివర్గంలో, కార్పొరేషన్ పదవుల్లో ఎందుకు బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు ఇవ్వడం లేదు? కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే బీసీల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రాజ్యాంగంలో పేర్కొ న్నా, ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటివరకు పాలకులు ఎందుకు చేయలేకపోయారు? ఈ అంశం దశాబ్దమున్నర కాలం అధికారంలో ఉన్న బీజేపీకి కూడా వర్తిస్తుంది. 

బీసీలందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీ సీలంతా ఐక్యంగా ఉంటూనే సామాజిక దృ క్పథంతో రిజర్వేషన్ల కోసం పోరాటం చే యాల్సిందే. అప్పుడే మన హక్కులు మనకు ల భిస్తాయి. దేశంలో మెజారిటీ సంఖ్య కలిగిన వె నుకబడిన వర్గం వారు ఏకమైతే, అధికారం వ స్తుందనే స్ఫృహ కల్పించాల్సిన అవసరముంది. అందుకు మార్గాలను వెతికి, వాటిని గుర్తించి అ మలు పరచాలి. అన్ని ప్రధానమైన కులాల వారీగా సమాన ప్రాతినిధ్యంతో బాగా వె నుకబడిన కులాల వారికి తగినంత ప్రాధాన్యత క ల్పించి సముచితంగా గౌరవించాలి.

బీసీ ముఖ్యమంత్రిగా..

బిందేశ్వరి ప్రసాద్ మండల్ 1918, ఆగస్టు 18న బీహార్ లోని బెనారస్‌లోని యాదవ సామాజికవర్గంలో జన్మించారు. బి.పి.మండల్ తన 23 వ ఏట జిల్లా కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు. బి.పి. మండల్ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. 1952లో తొలిసారి బీహార్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధికార పార్టీలో ఉండి బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రు లు దాడి చేయడాన్ని నిరసించారు.

1965లో తన నియోజకవర్గంలోని పామా గ్రామంలో మైనార్టీలు, దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారా లపై మాట్లాడాలని కోరినప్పుడు అధికార పార్టీలో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని సీఎం ఆదేశించడంతో, తను నమ్మిన విలువల కోసం ప్రతి పక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమై సంయుక్త సోషలిస్ట్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో ఆ పార్టీ రాష్ర్ట పార్లమెంటరీ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. మండల్ 1967, మార్చి 5న సోషిత్ దళ్ పార్టీని స్థాపించారు.

1967లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎస్‌ఏ అభ్యర్థుల ఎంపికపై ఆయన చేసి న కృషి అపారమైనది. ఆయన ప్రచారం వల్ల 1962లో 7 సీట్లు గల ఆ పార్టీకి 1967లో 69 సీట్లు వచ్చాయి. బీహార్‌లో రాంనరేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మండల్ పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ రాష్ర్ట మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మం త్రిగా పని చేశారు. పార్టీలో,ప్రభుత్వంలో విభేదా లు రావడం, కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్ద తు ఇవ్వడం వంటి పర్యవసానాలతో 1968 ఫిబ్రవరి 1న బి.పి.మండల్ బీహార్ రాష్ర్ట రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

పరిపాలనలో మహనీయుడు

కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పటికీ రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ల అవినీతిపై అయ్యర్ కమిషన్ వేశారు. దాంతో బి.పి. మండల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దాంతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయరం గం ద్వారా సంఘ సంస్కరణలు తీసుకురావడానికి, సామాజిక ఉద్యమాల ద్వారా,రాజకీయ సంస్కరణలను తీసుకురావడానికి, రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కోసం బిందేశ్వరి ప్రసాద్ మండల్ కృషి చరిత్రాత్మకం.

ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తిని సహించవచ్చు. కానీ, ప్రభుత్వాల నిర్ణయాల్లో ఏ కూలత త్వాన్ని సహించవద్దు అని చెప్పే మండల్.. తన ప్రభుత్వంలో, పరిపాలనలో ఎక్కడ కూలతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించిన మహనీయులుగా చరిత్రలో నిలిచారనేది నిర్వివాదాంశం. అసాధారణ పరిస్థితుల్లో ఓబీసీల మొఖాల్లో వెలుగు నింపిన బి.పి.మండల్ 1982 ఏప్రిల్ 13న మరణించారు. భారత ప్రభుత్వం 2001లో మండల్ గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసి చేతులు దులుపుకుందనే అభిప్రాయం ఉంది.  

వ్యాసకర్త సెల్ : 9866255355