సైద్ధాంతిక పోరాటం కోసమే
డాక్టర్‌తిరునహరిశేషు :
* జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ర్టపతి పదవి ఖాళీని భర్తీ చేయడానికి జరిగే ఎన్నికలకు పాలక ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార ఎన్డీఏ కూటమి చంద్రాపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్‌ని తన అభ్యర్థిగా ప్రకటిస్తే.. ప్రతిపక్ష ఇండియా కూటమి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది.
దేశంలో రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ర్టపతి పదవికి సె ప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతుంది. అయి తే ఇది సాధారణమైన ఎన్నికగా కాకుండా ఒక తెచ్చిపెట్టిన ఎన్నికగానే చూడాలి. ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇండియా కూటమి ఉపరాష్ర్టపతి పదవికి జరిగే ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించటంతో ఎన్నిక అనివార్యమైంది.
2022లో జరిగిన ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మా ర్గరెట్ ఆల్వా పై ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం సాధించారు. 2027 వరకు తన పదవీకాలం ఉన్నప్పటికీ ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే ఆరో గ్య సమస్యలను కారణాలుగా చూపుతూ ఉపరాష్ర్టపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయటంతో ఉపరాష్ర్టపతి పదవికి ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
1952 నుంచి ఇప్పటివరకు 16 పర్యాయాలు ఉపరాష్ర్టపతి పదవికి ఎన్నికలు జరిగితే సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు పర్యాయాలు.. మహమ్మద్ హిదయతుల్లా, గోపాల్ స్వరూప్ పాఠక్, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు దేశంలో 15 మంది ఉపరాష్ర్టపతులుగా పనిచేస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మహమ్మద్ హమీద్ అన్సారీలు మాత్రమే రెండు పర్యాయాలు ఉప రాష్ర్టపతులుగా పనిచేశారు.
ఇద్దరూ దక్షిణాది వారే
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ర్టపతి పదవి ఖాళీని భర్తీ చేయడానికి జరి గే ఎన్నికలకు పాలక ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార ఎన్డీ ఏ కూటమి తమిళనాడుకి చెందిన ప్రస్తు తం మహారాష్ర్ట గవర్నర్ గా పనిచేస్తున్న చంద్రాపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్‌ని తన అభ్యర్థిగా ప్రకటిస్తే.. ప్రతిపక్ష ఇం డియా కూటమి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది.
అయితే రెండు పక్షాలు ప్రకటించిన అభ్యర్థులు దక్షిణాది వారే కావటం విశే షం. తదుపరి ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా అనే క పేర్లు తెరపైకి వచ్చినా నాటకీయ పరిణామాల మధ్య రెండు పక్షాలు అనూహ్యంగా దక్షిణాది నుండే అభ్యర్థులను ఎంపిక చేశా యి. అధికార ఎన్డీఏ తన అభ్యర్థి రాధాకృష్ణన్‌ని వ్యూహాత్మకంగానే ఎంపిక చేసిందనే చెప్పాలి. రాష్ర్టపతి అభ్యర్థి ఎంపిక ఒడిశాలో బీజేపీకి ఎలా రాజకీయంగా కలిసి వచ్చిందో 2026 లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కూడా ఉపరాష్ర్టపతి అభ్యర్థి ఎంపిక రాజకీయంగా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుంది.
తమిళనాడులో పట్టు సాధించడానికి బీజేపీ జాతీయ అధ్య క్ష పదవికి తమిళనాడు నుంచే అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డా యి. అయితే ఉపరాష్ర్టపతి ఎన్నిక ద్వారా అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బిజెపి తన ఉపరాష్ర్టపతి అభ్యర్థిని తమిళనాడు నుంచే ఎంపిక చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండి యా కూటమి కూడా తన అభ్యర్థిని వ్యూ హాత్మకంగానే తెలంగాణ నుంచి ఎంపిక చేసింది.
ఎన్డీఏ కూటమి అభ్యర్థికి పోటీగా.. మొదట తమిళనాడు నుంచి డీఎంకే ఎంపీ తిరుచ్చి రవిని లేదా సైంటిస్టు అన్నాదురైని ఎంపిక చేయాలని భావించారు. కానీ ఇండియా కూటమి అభ్యర్థి ఎంపికలో తృణముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు పా ర్టీల ఒత్తిడి మేరకు రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన న్యా య కోవిదుడు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాని ఎంపిక చేసి కేవలం 182 ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ కూటమి చేతులు కాల్చుకుంది.
ముందే తేలిన ఫలితం
అయితే ఉపరాష్ర్టపతి ఎన్నిక ఫలితం ముందే తేలిపోయింది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం కలిపి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుగా భావిస్తారు. వారే ఉపరాష్ర్టపతిని ఎన్నుకుంటారు. లోక్ సభ, రాజ్యసభ మొ త్తం కలిపి 788 ఓట్లు ఉంటే పశ్చిమబెంగాల్ లోని బషీర్ హాట్ లోక్ సభ స్థానం జమ్మూ కాశ్మీర్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు పంజాబ్, జార్ఖండ్ లో ఒక రాజ్యసభ స్థానం మొత్తం ఆరు రాజ్యసభ స్థానా లు ఖాళీగా ఉన్నాయి.
దీంతో ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో పాల్గొనే మొత్తం ఓట్లు 781 గా ఉంటే గెలవడానికి కావలసిన ఓట్లు 391 మాత్రమే. కానీ ఉభయ సభల్లో ప్రస్తుతం రెండు పక్షాల బలం చూస్తే ఎన్డీఏకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సునాయాసంగానే విజయం సా ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొ త్తం 781 ఓట్లలో ఎన్డీఏ బలం 425 (293-132).. అలాగే ఇండియా కూటమి బలం 322 (236-86) గా కనిపిస్తుంది. ఏ కూటమికి చెందని పార్టీల బలం 34 (13-21) గా కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంచనంగానే కనిపిస్తుంది.
ఏ కూటమిలో లేని పార్టీల ఓట్లు 34 గా ఉంటే వీరిలో అత్యధికంగా 11 (4-7) ఓట్ల బలం ఉన్న వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్థికే తన మద్ద తు ప్రకటించడంతో ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ర్టపతి అభ్యర్థి బలం మరింత పెరిగిందనే చెప్పాలి. నాలుగు ఓట్ల బలం ఉన్న భారత రాష్ర్ట సమితి (బీఆర్‌ఎస్), 7 ఓట్ల బలం ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) త మ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. గత ఉపరాష్ర్టపతి ఎన్నికలతో పోల్చితే ఇండి యా కూటమి బలం గణనీయంగా పెరిగింది.
గత ఎన్నికల్లో ఇండియా కూటమి అ భ్యర్థి మార్గరెట్ ఆల్వాకి కేవలం 182 ఓట్లు మాత్రమే వస్తే ఈసారి ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 320 నుండి 330 ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్ సభలో విపక్షాల బలం పెరిగినా రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభలో మాత్రం విపక్షాల బలం గణనీయంగా తగ్గటంతో విపక్షాలు బలమైన పోటీ ఇవ్వగలుగుతున్నాయి కానీ గెలిచే అవకాశాలు లేవు.
సైద్ధాంతిక యుద్ధమా!
గెలిచే బలం లేకపోయినా ఏకగ్రీవ ప్రతిపాదనకు ఒప్పుకోకుండా ఇండియా కూట మి తన అభ్యర్థిని ఎందుకు పోటీలో నిలబెట్టిందనే ప్రశ్నలకి సమాధానంగా.. మా పోటీ రాజకీయ పోరాటం కాదు ఇది ఒక సైద్ధాంతిక యుద్ధ్దమని, రాజ్యాంగ పరిరక్షకులకి, రాజ్యాంగ వ్యతిరేకులకి మధ్య జరిగే పోరాటమని ఇండియా కూటమి చెబుతుంది. బహుశా ఎన్డీఏ కూటమి ప్రకటిం చిన అభ్యర్థికి ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, బీజేపీ క్రియాశీలక నాయకుడై ఉండ టం కూడా విపక్షాలు వ్యతిరేకించటానికి ఒక బలమైన కారణం అయి ఉండవచ్చు.
అందుకే ఉపరాష్ర్టపతి ఎన్నికని సైద్ధాంతిక పోరాటంగా ఇండియా కూటమి అభివర్ణిస్తుంది. రాష్ర్ట పతి, గవర్నర్లు, ఇతర అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవులకి రాజకీయాలతో సం బంధం లేని వారిని ఎంపిక చేస్తే ఆ పదవుల ప్రతిష్ట పెరగడమే కాదు వారు నిష్పక్ష పాతంగా పని చేయగలుగుతారు.
కానీ ఇలాంటి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవులకు కూడా రాజకీయ నాయకులను ఎంపిక చేసి ఆ హోదాని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చటం ప్రజాస్వామ్య వ్యవస్థకి శోభనివ్వ దు. భారత దేశంలో రాజకీయ పార్టీలు నా యకులు చెప్పేదానికి, ఆచరించడానికి ఎంతో వ్య త్యాసం కనబడుతున్న నేపథ్యంలో పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ సహా వివిధ రాజ్యాంగబద్ధ హోదాలలో పనిచేసే వారు నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయాలని ఆశిద్దాం.






