calender_icon.png 12 February, 2026 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన పోలింగ్

12-02-2026 12:27:13 AM

  1. ఈ నెల 13న ఓట్లు లెక్కింపు

ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

హుజూర్ నగర్ 23,926 ఓటర్లు ఓటు హక్కు వినియోగం 

82.88 పోలింగ్ శాతం నమోదు 

నేరేడుచర్ల 10,893 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగం

79.24 పోలింగ్ శాతం నమోదు

హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలోని 43వార్డులలో 1 వార్డు ఏకగ్రీవం

హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 3వార్డు సులువ నాగలక్ష్మిచందు ఏకగ్రీవం

హుజూర్ నగర్ (నేరేడుచర్ల) ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిలుచున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు.సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ చరమందరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది.

ఈ నెల 13న ఓట్లు లెక్కింపు ఉంటుందని, 16న మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.ఎన్నికల బరిలో ఉన్నవారి అదృష్టం ఈనెల 13న తేలబోతుంది.హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులలో పురుషులు 11287, మహిళలు 12633,ఇతరులు 6 ఈవిధంగా మొత్తం 23,926 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని 82.88 శాతం పోలింగ్ నమోదయినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

నేరేడుచర్ల మున్సిప ల్ పరిధిలోని 15 వార్డులలో పురుషులు 5142, మహిళలు 5750,ఇతరులు 1,ఈవిధంగా మొత్తం 10,893 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని 79.24 శాతం పోలింగ్ నమోదయి నట్లు మున్సిపల్ కమిషనర్  నాగరాజు తెలిపారు.

బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్

హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో తమ జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వాన్ని సాగించాయి.ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతు రాజకీయాన్ని రక్తికట్టించాయి. వాదనలు,సవాళ్లతో మొదలైన ప్రచార విలువలకు తిలోదకాలు దిద్దుతూ తిట్ల పురాణాల వరకు చేరుకుంది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని అంతా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్ ను,

అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్కుల్లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఎల్లుండి తేలనుంది.హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల లోని 43వార్డులకు గాను 1 వార్డు (హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 3వార్డు సులువ నాగలక్ష్మిచందు)ఏకగ్రీవం కాగా దీంతో ఇవాళ 42 వార్డులకు పోలింగ్ నిర్వహించారు.