టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పొన్నమనేని బాలాజీ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొ దురుపాక గ్రామానికి చెందిన పోన్నమనేని బాలాజీ రావుకు తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి అప్పగించింది. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా అన్ని విభాగాలకు రాష్ట్ర శాఖ అధ్యక్షులను నియమించగా అందులో సీనియర్ ప్రజా ప్రతినిధి, తెలంగాణ ఆవిర్భావంలో ఒకరిగా ఉన్నటువంటి బాలాజీ రావుకు తెలంగాణ రక్షణ సేన పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు.
దీంతో పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు రానుంది. కాగా బాలాజీ రావు సీనియర్ ప్రజా ప్రతినిధిగా పలు పదవులు చేపట్టి న అనుభవం ఉంది. అంతేకాకుండా ప్రజాబలం కూడా ఉండడంతో బాలాజీ రావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరి, పార్టీ కార్యకలాపాలతో పాటు కార్యాలయ విధులు నిర్వహించారు. బాలాజీ రావు అంకితభావంతో పనిచేసే, పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో మంచి గుర్తింపు నివ్వాలని కల్వకుంట్ల కవిత(kalvakuntla kavitha) బాలాజీ రావుకు ఏకంగా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవితో సత్కరించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాలాజీ రావు నియామకం పట్ల హర్షాభిరేఖలు వ్యక్తం అవుతున్నాయి. బాలాజీ రావు నియామకం పట్ల నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా నూతనంగా నియామకం అయిన బాలాజీ రావు మాట్లాడుతూ తనపై నమ్మకముతో రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించినందుకు పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు బాలాజీ రావు కృతజ్ఞతలు తెలిపారు.