10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కూలీలో పూజ ఖరారు

28-02-2025 12:00 AM

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమిర్ ఖాన్, నాగార్జున కూడా భాగమయ్యారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందంటూ కొద్ది రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో పూజా సైతం భాగమైందని వెల్లడించారు.

ఇటీవల ఓ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి దానిలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తించాలంటూ చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. దానిని చూసిన అభిమానులు అది పూజాదేనంటూ కన్ఫర్మ్ చేశారు. తాజాగా మేకర్స్ సైతం ఆ ప్రీ లుక్ పోస్టర్ పూజాదేనని తేల్చేశారు. అయితే ఈ చిత్రంలో పూజా పాత్ర ఏంటనేది తెలియరాలేదు.

కొందరేమో కీలక పాత్ర పోషిస్తోందని అంటుంటే.. మరికొందరు స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేస్తుందని అంటున్నారు. పూజా కోసం ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ తరహాలో ఒక పాటను సైతం ప్లాన్ చేశారని అభిమానులు అంటున్నారు. ఇక బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.