15 July, 2026 | 3:30 AM

పేలవంగా బెంగళూరు..

25-04-2024 12:42 AM

మరోవైపు బెంగళూరు జట్టు విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. సీజన్‌లో వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో పరాజయం పాలవుతూ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు కోల్పోయిన ఆ జట్టు మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది. కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన బెంగళూరును దురదృష్టం కూడా వెక్కిరిస్తుంది. బ్యాటింగ్ విభాగం పర్లేదనిపిస్తున్నప్పటికి బౌలింగ్ విభాగం మాత్రం మరింత పేలవంగా తయారైంది. బ్యాటింగ్ లో కోహ్ల్లీ మినహా మెరెవరూ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక ఫినిషర్‌గా దినేశ్ కార్తిక్ అదరగొడుతున్నాడు.

బౌలింగ్‌లో మాత్రం పెద్దగా మెరుపుల్లేవ్. వికెట్లు తీయడం కంటే పరుగులు సమర్పించుకోవడంలో బెంగళూరు బౌలర్లు పోటీ పడుతున్నారు. సిరాజ్, యష్ దయాల్, ఫెర్గూసన్, గ్రీన్, కర్ణ్ శర్మ రాణించాల్సిన అవసరముంది. ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు విజయం చాలా అవసరం. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్న బెంగళూరు.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓడిపోతే  ఈ సీజన్ నుంచి ఇంటికి వెళ్లే తొలి జట్టుగా నిలవనుంది. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ బరిలోకి దిగిన బెంగళూరు ఈసారి కూడా రిక్త హస్తాలతో టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.