17 April, 2026 | 8:48 PM

తుమ్మలచెల్కలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ

17-04-2026 07:10 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి ఐసిడీఎస్ సెక్టార్ లో సూపర్ వైజర్ కే.అనురాధ   ఆధ్వర్యంలో  మండలంలోని బద్దుతండా పంచాయతీ తుమ్మలచెల్క అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రతి ఇంటిలో తల్లి, బిడ్డ, ఆట, పాటల ద్వారా అభ్యసన పద్ధతులు ఆరోగ్యాకరమైన సంబాషణ ప్రదర్శించాలని, అలాగే ఆహారం తినిపించే సమయంలో పిల్లలతో మాట్లాడుతూ ఇంట్లో ఉండే ఆట వస్తువులతో ఆడుకోవడానికి పిల్లలను ప్రోత్సహించాలని తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లల మెదడు అభివృద్ధి అవసరమైన ప్రేరణ లు ఆటలు మరియు సంభాషణ ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బీ నరేష్  స్కూల్ టీచర్ సుభద్ర, అలాగే జిల్లా నుండి ఐసిపీఎస్  కళ్యాణి, భావన, మరియు ఆశ మారమ్మ, అంగన్వాడీ టీచర్స్ రాంబాయమ్మ, శారదా, సునీత, సుజాత, జ్యోతి హాజరైనారు.