calender_icon.png 18 October, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం మరణించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

17-10-2025 12:41:25 AM

బీఆర్‌ఎస్ లీడర్‌పై పోలీసులకు ఫిర్యాదు

భీమదేవరపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ మృతిచెందినాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు చింతల గీతారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భీమదేవరపల్లి మండల మహిళా శాఖ అధ్యక్షులు చిదురాల స్వరూప, ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి ముల్కనూర్ ఎస్‌ఐ ఎం. రాజుకు గురువారం ఫిర్యాదు చేశారు.

గీతారెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మృతి చెందినదని తన ఐడీ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టినందుకు ఆమెను వెంటనే అరెస్టు చేయాలన్నారు.మంత్రి పొన్నంపై పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే సహించబోమన్నారు.

వెంటనే పోలీస్ శాఖ అధికారులు చింతల గీతారెడ్డి పోస్టులను పరిశీలించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐకి ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు స్వర్ణలత, గాదపాక సౌందర్య,, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.