16 April, 2026 | 4:49 AM

రిటైర్‌మెంట్ రోజునే పోస్టింగ్..!

01-11-2025 12:09 AM

వెయిటింగ్‌లో ఉన్న ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు కరీంనగర్ ఈఎన్సీగా బాధ్యతలు

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : సాగునీటి పారుదల శాఖలో అ నూహ్య పరిణామం చోటు చేసుకున్నది. రిటైర్‌మెంట్ అయ్యే రోజునే ఒక అధికారికి పోస్టింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. సాగునీటి శాఖలో గతంలో ఈఎన్సీ జనరల్‌గా విధులు నిర్వర్తించిన అనిల్‌కుమార్‌కు తాజాగా కరీంనగర్ నీటి పారుదల శాఖ ఈఎన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

వాస్తవానికి అనిల్‌కుమార్ ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నారు. దీంతో పా టు అక్టోబర్ 31న ఆయన పదవీ విరమణ కూడా చేయనున్నారు. ఆయనకు కరీంనగర్ ఈఎన్సీగా బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విచారణ చే పట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమయం లో ఈఎన్సీ అనిల్‌కుమార్‌పై వేటు పడింది. కాళేశ్వరం ప్రాజె క్టులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, ఏసీబీకి చిక్కిన పలువురు అధికారుల పట్ల చూసీచూడనట్టు వ్యవహరించా రనే కారణంగా ప్రభుత్వం అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకున్నది.

ఈ క్రమంలో రెండు నెలలుగా పోస్టిం గ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్టులో పెట్టింది. ఆయన ప్రస్తుతం ఎలాంటి విధులు నిర్వర్తించడం లేదు. అనిల్‌కుమార్ అక్టోబర్ 31వ తేదీన రిటైర్‌మెంట్ ఉండటంతో ఆయన వె యిటింగ్ లిస్టులో ఉంటూనే పదవీ విరమణ పొందుతారని అంతా భావించారు. అలా జరిగితే ఆయనకు పెన్షన్‌తోపాటు వెయిటింగ్ కాలానికి సంబంధించిన జీతం కూడా రాకుండా పోయేది.

ఈఎన్సీ అనిల్‌కుమార్‌పై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిం చిందనే వాదనలు వినిపించాయి. కానీ, తాజాగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంతో ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు కాస్త ఉపశమనం లభించినట్టు అయింది. దీంతో ఆయనకు పెన్షన్‌తోపాటు వెయిటింగ్ కాలానికి జీతం కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.