01-11-2025 12:08:33 AM
- ప్రమాదంలో ధాన్యం లారీ అవస్థలు పడుతున్న రైతన్నలు
- పట్టించుకొని ఎఫ్ ఫి ఓ కొనుగోలు కేంద్రం సిబ్బంది
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు మండలం సింగారం గ్రామంలో సంహిత ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక లారీ ప్రమాదానికి గురైంది. కొనుగోలు కేంద్రం నుండి లోడ్ చేసిన ధాన్యం లోడ్ లారి రవాణా చేస్తున్న సమయంలో రహదారి దెబ్బతినడంతో లారీ మట్టి రోడ్డులో ఇరుక్కుపోయింది. దీంతో రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.ధాన్యం కొనుగోలు కేంద్రానికి సరిగ్గా లేని రోడ్డు కారణంగానే ధాన్యం లోడ్ లారి మట్టిలో ఇరుకుపోయిందని స్థానికులు రైతున్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.లారీని బయటకు తీయడానికి రెండు జెసిబిలను రంగంలోకి దించారు.స్థానిక యువకులు కలసి పలు గంటలపాటు కష్టపడ్డా లారీ పూర్తిగా బయటకు రాలేదు.
తమ కష్టార్జిత ధాన్యం చెడిపోకూడదనే ఆందోళనలో రైతులు బిక్కు బిక్కు మంటున్నారు. ఇకనైనా ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీ వెళ్లే టట్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని వేడుకుంటున్నారు.ఎఫ్ ఫి ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిబ్బంది సకాలంలో ఏ ఒక్కరు లేకపోవడం గమనార్హం.దీంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఇక మాకొద్దు ఎఫ్ ఫి ఓ సంస్థ అని మండి పడుతున్నారు.రాత్రి అయిన ఇంకా బయటికి వెళ్లని ధాన్యం లోడ్ లారీని రెండు జె సీబీ ల సహాయంతో చర్యలు చేపట్టిన బయటికి వెళ్లకపోవడంతో రైతన్నలు కన్నిరుమున్నీరు అవుతున్నారు.