calender_icon.png 1 November, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం

01-11-2025 12:10:14 AM

విద్యార్థులను వేధించిన ఘటనలో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

చొప్పదండి, అక్టోబర్31(విజయక్రాంతి):ఆడపిల్లలను వేధిస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో ఉన్న సమస్యల గురించి తనకు సమాచారం ఇవ్వాలని, పెద్దన్నలా అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.

పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నిమిషాల్లోనే నిందితుడైన అటెండర్ను, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం ను సస్పెండ్ చేయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, తాసిల్దార్ అంబటి రజిత,ఎండివో రామ్, ఎంఈఓ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య,పడాల రాజన్న, సాగి అజయ్ రావు,బుర్గు గంగన్న ,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ ,రోమాల రమేష్, పడితపల్లి కిషన్, రాచమల్ల భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి,కర్ర బాపు రెడ్డి, నగేష్, మహేష్,ఆనంద్,ముచ్చ శంకర య్య,మంత్రి మహేందర్, గంగాధర ప్రవీణ్,మ్యాక వినోద్ తదితరులుపాల్గొన్నారు.