సీఎంని కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశీ
హైదరాబాద్,(విజయక్రాంతి): పవర్ లిప్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రచలంకు చెందిన మోడెం వంశీ ఇటీవల సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ తరఫున బంగారు పతకం సాధించాడు. దీంతో వంశీ తను సాధించిన బంగారు పతకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించాడు.
పవర్ లిఫ్టింగ్ లో వంశీ సాధించిన ఘతను రేవంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. క్రీడాకారులకు ప్రభుత్వం తరుపున సహకారం ఉంటుందన్నారు. వంశీ వెంట అతని కుటుంబ సభ్యులతోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు ఉన్నారు.




