26 August, 2026 | 8:13 PM

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొట్టే ప్రదీప్

26-08-2026 06:49 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొట్టే ప్రదీప్ ఎన్నికయ్యారు. సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఉద్యోగులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాన్ని బలోపేతం చేస్తానన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.