26 August, 2026 | 7:41 PM

భాద్యత గా పని చేస్తే గుర్తింపు లభిస్తుంది

26-08-2026 06:49 PM

మోతె, ఆగస్ట్ 26 (విజయ క్రాంతి): కార్యకర్తలు బాధ్యతగా పని చేస్తే పార్టీలో గుర్తింపు లభిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని  సర్వరం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక సందర్బంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త పార్టీ ఇచ్చిన భాద్యతలను తూచ తప్పకుండా అమలు చేయాలని ఎన్నికలో పార్టీ సూచించిన వారిని గెలిపించాలని కోరారు. సర్వరం గ్రామశాఖ  అధ్యక్షులుగా వీరబోయిన పాపయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల గురుకృష్ణ, వెంకన్న, గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.