11 April, 2026 | 12:29 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతిచక్ర అవార్డులు

14-02-2026 12:00 AM

ఎల్బీనగర్, ఫిబ్రవరి 13 : నాగోల్ - బండ్లగూడ ఆర్టీసీ డిపోలో జనవరి నెలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు శుక్రవారం ప్రగతి చక్ర అవార్డులు, నగదు పురస్కారాలు అందజేశారు. అత్యధిక ఆదాయం తీసుకుని వచ్చిన కండక్టర్లు, ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెకానికల్ సిబ్బందికి అవార్డులతోపాటు నగదు పురస్కారం అందజేశారు.

కార్యక్రమంలో హైదరాబాద్ రీజినల్  డిప్యూటీ రీజినల్ మేనేజర్ శంకర్, డిపో మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. అవార్డులు సాధించిన ఉద్యోగుల ను  స్ఫూర్తిగా తీసుకొని ఆర్టీసీ డిపోను లాభాల్లో తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, మెకానికల్ ఇంజినీర్ బాలయోగేశ్వరి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.