14-02-2026 12:00:00 AM
గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందించిన కలెక్టర్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందనీ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈనెల 16న జరగనున్న పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్థానిక టిటిడిసిలో మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేసారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, నోడల్, ఎన్నికల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.