17 August, 2026 | 12:46 PM

ప్రజ్ఞానందకు నిరాశ

16-08-2024 12:00 AM

సెయింట్ లూయిస్ (అమెరికా): భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో నిరాశపరిచాడు. ర్యాపిడ్ పోటీలు ముగిసేసరికి ప్రజ్ఞా నాలుగు ఓటములు, మూడు డ్రాలతో చివరి స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఏడో రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ డొమిన్‌గేజ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ర్యాపిడ్ రౌండ్ ముగిసేసరికి నెపొమ్నియాట్చి (రష్యా), ఫిరౌజా (ఫ్రాన్స్), లాగ్రేవ్ (ఫ్రాన్స్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. నేటి నుంచి బ్లిట్జ్‌లో రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌లు జరగనున్నాయి.