calender_icon.png 9 January, 2026 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట

08-01-2026 07:00:50 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి సెక్షన్‌లోని సత్యంపేట గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రజాబాట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్.ఈ మహేందర్(ఆపరేషన్స్), ఏఈ ఆపరేషన్స్ హెచ్టీఎల్టీ లైనులకు పూర్తి మెయింటెనెన్స్ చేశారు. ఒక సింగిల్ ఫేజ్ 15 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ను ప్రమాదాలు జరగాకుండా సురక్షిత ఎత్తుకు ఎత్తారు.

అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కు హెచ్టీఎల్టీ ఫ్యూజ్ సెట్లు ఏర్పాటు చేసి ఎర్తింగ్ పూర్తిగా కొత్తగా మార్చి సరిచేశారు. ఎస్ఈ, విద్యుత్ సిబ్బంది మొత్తం గ్రామాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి, ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకం ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్లు ఎలా పొందాలో వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తంగూడెం సర్కిల్ ఎస్ ఈ జి.మహేందర్, పాల్వంచ ఏడిఈ రహీమ్ హుస్సేన్, ముల్కలపల్లి ఏఈ నరేష్, సిబ్బంది మాదారం సర్పంచ్ గంపా సుజాత సత్యంపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.